ఉత్తరప్రదేశ్లో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయి
7tv focus : ఉత్తరప్రదేశ్లోని బీజేపీ పాలనలో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అయితే కేవలం 14 కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ప్రయత్నంలో భాగంగానే ఉద్దేశపూర్వకంగా ఈ విధ్వంసకాండ జరిగిందని ఆయన విమర్శించారు. ఆదివారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని 72 జిల్లాల్లో బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహాలు 151 వరకు ధ్వంసమైనట్లు తెలిపారు. తమ పార్టీ గుర్తించిన సంఘటనలు, పోలీస్ కేసులు, ప్రభుత్వ సమాచారం ఆధారంగా ఈ లెక్క తేల్చినట్లు చెప్పారు. ‘బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహాలే అత్యధికంగా ధ్వంసమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ హయాంలో 72 జిల్లాల్లో 151కు పైగా...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads