private-banks_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

 ఆదివారం కూడా ప‌నిచేయ‌నున్న బ్యాంకులు..

 7tv focus : వ‌చ్చే ఆదివారం, సెప్టెంబ‌ర్ 27న దేశంలోని బ్యాంకులు ప‌నిచేయ‌నున్నాయి. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులు ఆదివారం కూడా ప‌ని చేస్తాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. సెప్టెంబ‌ర్ 28-30 వ‌ర‌కు మూడు రోజుల‌పాటు బ్యాంకు సిబ్బంది స‌మ్మె చేయ‌బోతున్న‌ట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియ‌న్స్ (యూఎఫ్‌బీయూ) ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.వ‌రుస‌గా మూడు రోజుల‌పాటు బ్యాంకులు ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని, అందువ‌ల్ల ఆదివారం సెల‌వు రోజైన‌ప్ప‌టికీ బ్యాంకులు ప‌నిచేసేలా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కేంద్ర ఆర్థిక శాఖ ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌ల బ్యాంకింగ్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. బ్యాంకులు, ఏటీఎంలు సెప్టెంబ‌ర్ 27 వ‌ర‌కు పూర్తిస్థాయిలో ప‌ని చేయాల‌ని ఇటీవ‌ల...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article