అమెరికా ముందు ఇరాన్ కీలక ప్రతిపాదన..!
7tv focus : అగ్రరాజ్యం అమెరికా తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చడం కోసం ఇరాన్ ఓ కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. హర్మూజ్ జలసంధి ని తిరిగి తెరిచి, కేవలం ఏడు రోజుల్లోనే విస్తృత చర్చలను పునఃప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఈ వారంలోనే అమెరికా అధికారులకు పంపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిఅబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనపై అమెరికా ఇంకా స్పందించలేదు.కాగా ప్రపంచంలోని చమురు సరఫరాలో దాదాపు 20 నుంచి 25 శాతం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతున్నది. ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత టెహ్రాన్ ఈ మార్గంలో మైన్లు పెట్టి నౌకల రాకపోకలను దాదాపుగా నిలిపివేసింది....
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads